జీవమున్నంత వరకూ.. అయ్యప్పా... నీ ధ్యానము నేను మరువనూ.... ఊ.. ఊ..
జీవమున్నంత వరకూ.. అయ్యప్పా... నీ ధ్యానము నేను మరువనూ.... ఊ.. ఊ.. ॥ కోరస్ ॥ ॥జీవమున్నంత॥
కంటి నిండ నిన్ను చూడక ముందే అప్పుడే నన్ను మర్చిపోతివా
దారిలోన కోటి తిప్పలు పడితి ఆ సంగతి నీవు తెలుసుకుంటివా
కంటి నిండ నిన్ను చూడక ముందే అప్పుడే నన్ను మర్చిపోతివా ॥ కోరస్ ॥
దారిలోన కోటి తిప్పలు పడితి ఆ సంగతి నీవు మర్చిపోతివా
నీ పూజ చేయా తలచీ.... అయ్యప్పా... పుట్టెడు కష్టాలు పాలైతినయా ఆ.. ఆ.. ॥జీవమున్నంత॥
పంబా ఒడ్డున నాగు పడగలో పవళించి ఉన్నావని
నీ అన్న కన్నె మూల గణపతి స్వామి ఒకడు కొలువు దీరే
పంబా ఒడ్డున నాగు పడగలో పవళించే ఉన్నావని ॥ కోరస్ ॥
నీ అన్న కన్నె మూల గణపతి స్వామి ఒకడు కొలువు దీరే
కాంతమల గిరి కొండపై... అయ్యప్పా... మకర జ్యోతివై వెలుగుచుంటివా ఆ.. ఆ.. ॥జీవమున్నంత॥
అమావాస్య రాతి రాయే అడవంతా చీకటాయే
నాలుగు దిక్కులు ఏకమాయే అడ్డదారియే లేకపోయే
అమావాస్య రాతి రాయే అడవంతా చీకటాయే ॥ కోరస్ ॥
నాలుగు దిక్కులు ఏకమాయే అడ్డదారియే లేకపోయే
నువ్వు గుడిలో నుండి చూస్తున్నవా... అయ్యప్పా... గుడి వదలీ బయటకు రావయ్య ఆ.. ఆ.. ॥జీవమున్నంత॥
మండల దీక్ష మాల వేసుకుని ఇరుముడి నీకు అప్పజెప్పాలని
మెట్లను మొక్కి ఎక్కుకుని మా బాధలు నీకు చెప్పుకోవాలని
మండల దీక్ష మాల వేసుకుని ఇరుముడి నీకు అప్పజెప్పాలని ॥ కోరస్ ॥
పద్దెంది మెట్లను మొక్కి ఎక్కుకుని మా బాధలు నీకు చెప్పుకోవాలని
నిన్ను చూడనీయరేమయా.. అయ్యప్పా... స్వామి నిన్ను మొక్కనీయరేమయ్య ఆ.. ఆ.. ॥జీవమున్నంత॥