నా చిన్న మణికంఠకు పందిరి కట్టంగా
నా చిన్న మణికంఠకు పందిరి కట్టంగా ||కోరస్||
పందిరి మీదాడింది నాగు - పందిరంచు మీదాడింది నాగు
పందిరి మీదాడింది నాగు - పందిరంచు మీదాడింది నాగు ||కోరస్||
నా చిన్ని మణికంఠకు ఊయల కట్టంగా
నా చిన్ని మణికంఠకు ఊయల కట్టంగా ||కోరస్||
ఉయ్యాలలూపింది నాగు - ఉయ్యాల తాడుమీదాడింది నాగు
ఉయ్యాలలూపింది నాగు - ఉయ్యాల తాడుమీదాడింది నాగు ||కోరస్||
నా చిన్ని మణికంఠకు పాలను పట్టంగా
నా చిన్ని మణికంఠకు పాలను పట్టంగా ||కోరస్||
పాలల్లో తేలింది నాగు - పాలగిన్నె మీదాడింది నాగు
పాలల్లో తేలింది నాగు - పాలగిన్నె మీదాడింది నాగు ||కోరస్||
నా చిన్ని మణికంఠకు పడినే పెట్టంగ
నా చిన్ని మణికంఠకు పడినే పెట్టంగ ||కోరస్||
పడిమీదాడింది నాగు - పడిమెట్ల మీదాడింది నాగు
పడిమీదాడింది నాగు - పడిమెట్ల మీదాడింది నాగు ||కోరస్||
నా చిన్ని మణికంఠకు పంచె కట్టంగా
నా చిన్ని మణికంఠకు పంచె కట్టంగా ||కోరస్||
పంచెమీదాడింది నాగు - పంచె అంచుమీదాడింది నాగు
పంచెమీదాడింది నాగు - పంచె అంచుమీదాడింది నాగు ||కోరస్||
శబరి తల్లి భూదేవికి ముక్కెర పెట్టంగా
శబరి తల్లి భూదేవికి ముక్కెర పెట్టంగా ||కోరస్||
ముక్కుమీదాడింది నాగు - ముక్కు ముక్కెర మీదాడింది నాగు
ముక్కుమీదాడింది నాగు - ముక్కు ముక్కెర మీదాడింది నాగు ||కోరస్||