నిన్నే నమ్మాను ఈ లోకమే శూన్యము
నాదంటూ ఏమి లేదు ఈ జన్న గాలి లోన దీపము
నిన్నే నమ్మాను ఈ లోకమే శూన్యము ॥ కోరస్ ॥
నాదంటూ ఏమి లేదు ఈ జన్న గాలి లోన దీపము
నేను ప్రాణముతో ఉన్న అయ్యప్ప నిను చూసేందుకు
నేను ప్రాణముతో ఉన్న అయ్యప్ప నిను చూసేందుకు ॥ కోరస్ ॥ ॥నిన్నే నమ్మాను॥
నీ దరి చేర్చకుంటే ఆ తప్పే నీదిలే
నీవు దగ్గరి సొంతము అనుకున్నోలందరూ
నువ్వు అంతమై పోవాలని చూస్తూ ఉంటారు ॥ 2 ॥
నీకు ప్రాణమైన చుట్టాలే నమ్ముకున్నోలందరూ
నిన్ను వెన్నుపోటు పొడిచి వెనకాల గోతులు తీస్తరు ॥ 2 ॥
కపటముతో నటించే వాడ్ని దేవుడని అంటారు ॥ 2 ॥
ఉన్నది ఉన్నటంటే మూర్ఖులంటారూ.. ॥నిన్నే నమ్మాను॥
నీవు కట్టుకున్న బంగ్లా దాచిన ధనము వెంట రావురన్న
సోకులు చేసిన సొమ్ములు దింపుడు గల్లము వరకు అన్న ॥ 2 ॥
పోయేటప్పుడు ఒంటరిగానే వెళ్లిపోతవన్నా
ఎంత మొత్తుకున్న చివరకు మొలతాడు ఉంచరన్న ॥ 2 ॥
కళ్లు తెరువు ఓ మనిషి విర్ర వీగకు అంతా తెలిసి ॥ 2 ॥
ఊరవతల ఉన్నది ఆరడుగుల ఇల్లు ॥నిన్నే నమ్మాను॥
తల్లిదండ్రులను ఆఖరి చూపులు చూడని కొడుకు బిడ్డలు
కన్నవాళ్లను చూడ నోచుకోని తల్లీ తండ్రులు ॥ 2 ॥
మహమ్మారి కరోనా పురుగు చేసిన నష్టాలు
కరుణ లేని కలికాలం ఎవరికి సొంతం ॥ 2 ॥
నీయమ్ములైన పీయమ్ములైన రాజు మహారాజులైన ॥ 2 ॥
విధి నిర్ణయ తుఫానులో మనుసులు సైతం ॥నిన్నే నమ్మాను॥