పందళ రాజా పంచ గిరీశ స్వామి రావయ్యో మణికంఠా రావయ్యో
పంబావాస మా పడి పూజకు స్వామి రావయ్యో మణికంఠా రావయ్యో ॥పందళ రాజా॥ ॥ కోరస్ ॥
గణపతి పూజల్లో స్వామి ఘనముగ మొక్కీతి
గురుస్వామి పాదాలకు స్వామి దండాలు పెట్టితి ॥ 2 ॥ ॥ కోరస్ ॥
కన్నెస్వాముల్లోన - నిన్నే చూతుము
కత్తి స్వాముల్లోన - నిన్నే కొలుతుము
గంట స్వాముల్లోన - గంట మోగిత్తుము
కన్నె స్వాముల్లోన నిన్నే చూతము, కత్తి స్వాముల్లోన నిన్నే కొలుతుము,
గంటా స్వాముల్లో గంట మోగిత్తుము స్వామీ రావయ్యో మణికంఠా రావయ్యో,
స్వామీ రావయ్యో మణికంఠా రావయ్యో ॥ కోరస్ ॥ ॥పందళ రాజా॥
అమ్మవారి తల్లికి స్వామి అర్చన చేసేము
మురుగనయ్య స్వామిని అయ్య నీ ముందు కొలిచేము ॥ 2 ॥
గథా స్వాములంతా గంతేసి వచ్చారు
గురు స్వాములంతా - గుంపుగ వచ్చారు
పెరియ స్వాములంతా - ప్రేమతో వచ్చారు
గథా స్వాములంతా గంతేసి వచ్చారు, గురు స్వాములంతా గుంపుగ వచ్చారు
పెరియ స్వాములంతా ప్రేమతో వచ్చారు, స్వామీ రావయ్యో మణికంఠా రావయ్యో,
స్వామీ రావయ్యో మణికంఠా రావయ్యో ॥ కోరస్ ॥ ॥పందళ రాజా॥
అభిషేకాలతో స్వామిని ఆరాధించేము -
పూలు పండ్లు తెచ్చి స్వామికి ముందుగా పెట్టాము ॥ 2 ॥
నూటా ఎనిమిది - శరణాలు చెప్పాము
పంది మెట్లకు పూజలు చేశాము
పేట తుళ్లి ఆడి - నిన్ను మెప్పించాము
నూటా ఎనిమిది శరణాలు చెప్పాము, పంది మెట్లకు పూజలు చేశాము
పేట తుళ్లి ఆడి నిన్ను మెప్పించాము స్వామీ రావయ్యో మణికంఠా రావయ్యో,
స్వామీ రావయ్యో మణికంఠా రావయ్యో ॥ కోరస్ ॥ ॥పందళ రాజా॥