Ayyappa App
డౌన్‌లోడ్ యాప్

నాకు వచ్చిన ఘోష

🎤 గాయకుడు: పెద్దపులి ఈశ్వర్
🎤 రచయిత: పెద్దపులి ఈశ్వర్

నాకు వచ్చిన ఘోష ఎవలకు రావద్దు అయ్యా... అయ్యప్పా...
అయ్య నా రాత ఏమి రాతైనది స్వామీ.... మణికంఠా....                                             ॥నాకు వచ్చిన॥


నీళ్ల మీద తెప్పవోలె నాకు నిలకడన్నది లేకపాయె
బాధల బంధీకానలో నా బతుకు అంధకారం నిండిపాయె                                             ॥ 2 ॥


గడియ గడియ గండమోలె గడవస్తినయ్యా.... ఓ... ఓ... ఓ... అయ్యప్ప
గమ్యమే తెలియని బాటసారి నయితినయ్యా... ఓ... ఓ... ఓ.. అయ్యప్పా                           ॥నాకు వచ్చిన॥


అందరు ఒంటి గానే నా జన్మ రంధులు పడ్డాను తండ్రి
అప్పులన్ని కుప్పలాయె నాకు సెప్ప రాని తిప్పలాయె                                                ॥ 2 ॥


అయిన వాళ్లు నన్ను ఆదుకోలేదు అయ్యా.. ఓ... ఓ... ఓ.. అయ్యప్పా
నా సీకటి బతుకుల్లో వెలుగులు నింప రావా స్వామి... ఓ... ఓ... ఓ... అయ్యప్పా                    ॥నాకు వచ్చిన॥


నమ్మలేదయ్య ఏనాడు ఉన్నాడంటే నన్ను ఏలువాడు
నా అనే గర్వముతోని నేను నవ్వుల పాలైనాను                                                           ॥ 2 ॥


భగవంతుడంటేనే భగ భగ మండిపోయినా... ఓ... ఓ... ఓ... అయ్యప్పా
నేను తప్పు తెలుసుకొని తలదించుకున్నాను స్వామీ.. ఓ... ఓ... ఓ... అయ్యప్ప                         ॥నాకు వచ్చిన॥


దైవమంటే నమ్మనోన్ని నీ దాసునిగా మారినాను
కరిమల పురవాస నేను స్వామి నిన్ను శరణు కోరినాను                                                   ॥ 2 ॥


నాలోని పాపాలు నాశనము చేయవయ్యా... ఓ... ఓ... ఓ... అయ్యప్ప
నా మొర నాలకించి మోక్షమియ్య రావయ్యా... ఓ... ఓ... ఓ... అయ్యప్ప                                     ॥నాకు వచ్చిన॥

← భజన పాటల జాబితాకు తిరిగి వెళ్ళండి