Ayyappa App
డౌన్‌లోడ్ యాప్

చల్లని ఓ చిరుగాలి

🎤 గాయకుడు: మన్నె ప్రవీణ్ కుమార్
🎤 రచయిత: మన్నె ప్రవీణ్ కుమార్

చల్లని ఓ చిరుగాలి స్వామిని అడిగానని కబురు తెలుపవే
కిలకిల ఓ చిలకమ్మా బాటలో ఉన్నానని మాట చెప్పవే
స్వామియే శరణం స్వామి అయ్యప్ప శరణం
స్వామియే శరణం స్వామి అయ్యప్ప శరణం
చల్లని - చల్లని - చల్లని ఓ చిరుగాలీ


ముత్యాల నా తండ్రీ రతనాల నా తండ్రీ - మిరుముట్లు గొలిపేటి వజ్రాల నా తండ్రీ
పగడాల నా తండ్రీ మురిపాల నా తండ్రీ - బంగారు మెరుపుల్లో ధగ ధగ నా తండ్రీ
చల్లని - చల్లని - చల్లని ఓ చిరుగాలీ


పువ్వుల్లో నా తండ్రీ నవ్వుల్లో నా తండ్రీ ఉపదేశమిచ్చేటి గురువుల్లో నా తండ్రీ
అగ్నిలో నా తండ్రీ పృథ్వీలో నా తండ్రీ గాలి భూమి తరిమే ఘనమైన నా తండ్రీ
చల్లని - చల్లని - చల్లని ఓ చిరుగాలీ


శ్రీకారం నా తండ్రీ ఓంకారం నా తండ్రీ - మంత్ర తంత్రాల్లో మా శక్తి నా తండ్రీ
జగతిలో నా తండ్రీ ప్రగతిలో నా తండ్రీ సిరిగల్ల నా తండ్రీ దయగల్ల నా తండ్రీ
చల్లని - చల్లని - చల్లని ఓ చిరుగాలీ


ప్రళయమే నా తండ్రీ విలయమే నా తండ్రీ దుష్ట శక్తుల తరిమే రుద్రుడే నా తండ్రీ
శాంతుడే నా తండ్రీ కాంతుడే నా తండ్రీ స్నేహాలనందించే వీరుడే నా తండ్రీ
చల్లని - చల్లని - చల్లని ఓ చిరుగాలీ

← భజన పాటల జాబితాకు తిరిగి వెళ్ళండి