Ayyappa App
డౌన్‌లోడ్ యాప్

పళ్ళి కట్టు - శబరి మళక్కు

🎤 గాయకుడు: పి.కేశవ గురుస్వామి
🎤 రచయిత: పి.కేశవ గురుస్వామి

పళ్ళి కట్టు - శబరి మళక్కు
ఇరుముడి కట్టు - శబరి మళక్కు
కట్టుం కట్టి - శబరి మళక్కు
కళ్ళుం ముల్లుం - కాలికి మెత్తై
పళ్ళి కట్టు శబరి మళక్కు కళ్ళెం ముళ్లం కాలికి మెతై
స్వామియే అయ్యప్పో - అయ్యప్పో స్వామియే                                                         ॥ కోరస్ ॥ ॥ 2 ॥


అఖిలాండేశ్వర అయ్యప్పా - అఖిల చరాచర అయ్యప్పా
హరి గురువే అయ్యప్పా - ఆశ్రిత వత్సల అయ్యప్పా                                                 ||స్వామియే అయ్యప్పో||


కార్తీక మాసం మాలలు వేసి మండల పూజలు చేసుకుని
నలుబది దినములు దీక్షలతో ఇరుముడి కట్టి పయనించు                                          ||స్వామియే అయ్యప్పో||


స్వామి శరణం అయ్యప్ప శరణం - అయ్యప్ప శరణం - స్వామీ శరణం
స్వామియే - అయ్యప్పో - అయ్యప్పో - స్వామియే


నెయ్యాభిషేకం స్వామిక్కే - కర్పూర దీపం స్వామిక్కే
భస్మాభిషేకం స్వామిక్కే - పాలాభిషేకం స్వామిక్కే                                                     ||స్వామియే అయ్యప్పో||


తేనాభిషేకం స్వామిక్కే - చందనాభిషేకం స్వామిక్కే
పూలాభిషేకం స్వామిక్కే - పన్నీరాభిషేకం స్వామిక్కే                                                 ||స్వామియే అయ్యప్పో||


అప్పా అప్పా - అయ్యప్పా స్వామి అప్పా - అయ్యప్పా
శబరి గిరీశ - అయ్యప్పా - శ్రీధర్మ శాస్తా - అయ్యప్పా


అలుదా నదిలో స్నానము చేసి అలసట తీర్చి వచ్చేము
పంబా నదిలో స్నానము చేసి పాపాలన్నీ వదిలేము                                                 ||స్వామియే అయ్యప్పో||


దేహ బలందా అయ్యప్పా - పాద బలందా అయ్యప్పా
నిను తిరు సన్నిధి అయ్యప్పా - చేరెదమయ్య అయ్యప్పా                                         ||స్వామియే అయ్యప్పో||


భగవానే భగవతియే భగవతియే - భగవానే
ఈశ్వరనే ఈశ్వరియే ఈశ్వరియే ఈశ్వరనే                                                             ||పళ్ళి కట్టు||

← భజన పాటల జాబితాకు తిరిగి వెళ్ళండి