రావా అయ్యప్ప స్వామి రవ్వల పందిళ్ళలోకి
రవ్వల పందిళ్ళలోన ముత్యాల ముగ్గులేసి || 2 ||
ముత్యాల ముగ్గులోన రతనాల రాశి బోసి
రతనాల రాశిపైన పేటలే వేసినాము
రావా - రావా - రావా - రావా, రావా, రావా ॥రావా అయ్యప్ప॥
అరటి చెట్లు తెచ్చినాము మండపాలు కట్టినాము
మల్లె పూలు తెచ్చినాము మాలలే కట్టినాము
కొబ్బరాకులు తెచ్చినాము తోరణాలు కట్టాము
రావా - రావా - రావా - రావా, రావా, రావా ॥రావా అయ్యప్ప॥
మేళ తాళాల తోటి భజనలే చేసినాము
ఆవు నెయ్యి తోటి నీకు దీపాలే పెట్టినాము
పంచామృతముల తోటి అభిషేకం చేసినాము
రావా - రావా - రావా - రావా, రావా, రావా ॥రావా అయ్యప్ప॥
మంత్ర తంత్రాల తోటి పూజలే చేస్తాము
పాలు పండ్లు తెచ్చినాము నైవేద్యం పెట్టినాము
కర్పూరం వెలిగించి హారతులే ఇస్తాము
రావా - రావా - రావా - రావా, రావా, రావా ॥రావా అయ్యప్ప॥