మల్లెపూల పల్లకి బంగారు పల్లకి ॥ 2 ॥
మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి ॥ 2 ॥
విల్లాలి వీరుడు - ఎక్కినాడు పల్లకి ॥ 2 ॥
వీర మణి కంఠుడు - ఎక్కినాడు పల్లకి ॥ 2 ॥
పందళ బాలుడు పంబా వాసుడు
హరి హర తనయుడు ఎక్కినాడు పల్లకి ॥మల్లెపూల॥
గణపతి సోదరుడు - ఎక్కినాడు పల్లకి ॥ 2 ॥
షణ్ముఖ సోదరుడు - ఎక్కినాడు పల్లకి ॥ 2 ॥
ఎరిమేలి వాసుడు ఏకాంత వాసుడు
హరి హర తనయుడు ఎక్కినాడు పల్లకి ॥మల్లెపూల॥
మహిషీ మర్దనుడు - ఎక్కినాడు పల్లకి ॥ 2 ॥
మదగజ వాహనుడు - ఎక్కినాడు పల్లకి ॥ 2 ॥
కరిమల వాసుడు నీలిమల వాసుడు
హరి హర తనయుడు ఎక్కినాడు పల్లకి ॥మల్లెపూల॥
కాంతిమల వాసుడు - ఎక్కినాడు పల్లకి ॥ 2 ॥
జ్యోతి స్వరూపుడు - ఎక్కినాడు పల్లకి ॥ 2 ॥
భక్తుల బ్రోచె బంగారు స్వామి
హరి హర తనయుడు ఎక్కినాడు పల్లకి ॥మల్లెపూల॥