Ayyappa App
డౌన్‌లోడ్ యాప్

ఓ కొండలారా ఓ కోనలారా

🎤 గాయకుడు: గంగపుత్ర నర్సింగ్ రావు
🎤 రచయిత: గంగపుత్ర నర్సింగ్ రావు

ఓ కొండలారా ఓ కోనలారా ఓ వాగులారా ఓ వంకలారా
ఓ కొండలారా ఓ కోనలారా ఓ వాగులారా ఓ వంకలారా                                     ॥కోరస్॥
నా స్వామి ఏడున్నడో నా మణికంఠుడేడున్నడో
నా స్వామి ఏడున్నడో నా మణికంఠుడేడున్నడో                                             ॥కోరస్॥
అయ్య మీరైనా చెప్పరయ్యా ఆ పసి బాలుడేడున్నడో
అయ్య మీరైనా చెప్పరయ్యా ఆ పసి బాలుడేడున్నడో                                      ॥కోరస్॥ ॥ఓ కొండలారా॥


ఓ చెట్టులారా ఓ పుట్టలారా పూచే పువ్వులారా కాచే కాయలారా
ఓ చెట్టులారా ఓ పుట్టలారా పూచే పువ్వులారా కాచే కాయలారా                              ॥కోరస్॥
నా స్వామి ఏడున్నడో నా మణి కంఠుడేడున్నడో
నా స్వామి ఏడున్నడో నా మణి కంఠుడేడున్నడో                                              ॥కోరస్॥
అమ్మ మీరైనా చెప్పరమ్మా ఆ పసి బాలుడేడున్నడో
అమ్మ మీరైనా చెప్పరమ్మా ఆ పసి బాలుడేడున్నడో                                          ॥కోరస్॥  ॥ఓ కొండలారా॥


యాదగిరి నర్సన్న భద్రాద్రి రామన్న తిరుపతిలో ఉన్న నా తండ్రి వెంకన్న
యాదగిరి నర్సన్న భద్రాద్రి రామన్న తిరుపతిలో ఉన్న నా తండ్రి వెంకన్న                             ॥కోరస్॥
శ్రీశైల శివన్న కొమరెల్లి మల్లన్న కొండ గుట్టలో ఉన్న నా తండ్రి అంజన్న
నా స్వామి ఏడున్నడో నా మణికంఠుడు ఏడున్నడో
నా స్వామి ఏడున్నడో నా మణికంఠుడు ఏడున్నడో                                                           ॥కోరస్॥
అయ్య మీరైనా చెప్పరయ్యా ఆ పసి బాలుడేడున్నడో
అయ్య మీరైనా చెప్పరయ్యా ఆ పసి బాలుడేడున్నడో                                                        ॥కోరస్॥  ॥ఓ కొండలారా॥


కంచి కామాక్షమ్మ మధుర మీనాక్షమ్మ బెజవాడలో ఉన్న మా కనక దుర్గమ్మ
కంచి కామాక్షమ్మ మధుర మీనాక్షమ్మ బెజవాడలో ఉన్న మా కనక దుర్గమ్మ                              ॥కోరస్॥
ఏడు పాయలో ఉన్న మా తల్లి దుర్గమ్మ ఓరుగల్లులోని సమక్క సారక్క
నా స్వామి ఏడున్నడో నా మణికంఠుడు ఏడున్నడో
నా స్వామి ఏడున్నడో నా మణికంఠుడు ఏడున్నడో                                                            ॥కోరస్॥
అమ్మ మీరైనా చెప్పరమ్మా ఆ పసి బాలుడేడున్నడో
అమ్మ మీరైనా చెప్పరమ్మా ఆ పసి బాలుడేడున్నడో                                                           ॥కోరస్॥  ॥ఓ కొండలారా॥

← భజన పాటల జాబితాకు తిరిగి వెళ్ళండి