Ayyappa App
డౌన్‌లోడ్ యాప్

నిను చూడగ నేనుండగలనా

🎤 గాయకుడు: గంగపుత్ర నర్సింగ్ రావు
🎤 రచయిత: గంగపుత్ర నర్సింగ్ రావు

నిను చూడగ నేనుండగలనా - నీ కొండకు రాకుండ గలనా
ఈ దేహం నీదూ ప్రసాదం నా ప్రాణం నీ ఉపకారం
నా ప్రాణం నీ ఉపకారం                                                                               ॥నిను చూడగ॥


మనసన్నది నీ ధ్యాసలోనే - తనువున్నది నీ సేవలోనే
మనసన్నది నీ ధ్యాసలోనే - తనువున్నది నీ సేవలోనే
ప్రతి నోట నీ శరణ నామము - నా నోటే నీ మధుర గానం
నా నోటే నీ మధుర గానం                                                                              ॥నిను చూడగ॥


ఆ బ్రహ్మకు నే ఋణ పడనా - రాత రాసాడు నిను చూడగా
ఆ బ్రహ్మకు నే ఋణ పడనా - రాత రాసాడు నిను చూడగా
కనిపించే దైవాలు తల్లి తండ్రులే - జన్మనిచ్చారు ఏ నాటి ఫలమో
జన్మనిచ్చారు ఏ నాటి ఫలమో                                                                          ॥నిను చూడగ॥


ఈ ఇహమందు ఏ కొత్త కోరికలు - ఇక రాకుండ నువ్వ చూడవా
ఈ ఇహమందు ఏ కొత్త కోరికలు - ఇక రాకుండ నువ్వ చూడవా
ఈ జన్మంత నిను కొలిచి సేవింతునయ్యా - ఇక మరుజన్మ నాకెందుకయ్య
ఇక మరుజన్మ నాకెందుకయ్య                                                                           ॥నిను చూడగ॥

← భజన పాటల జాబితాకు తిరిగి వెళ్ళండి