భూత నాథ సదా నందుడా సర్వ భూత దయాకరా
భూత నాథ సదా నందుడా సర్వ భూత దయాకరా
రక్ష రక్ష మహానుభావ రక్ష రక్ష మహానుభావ
స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప ॥భూతనాథా॥
మాల వేసే స్వాముల చూస్తే మనస్సు నాకు పులకరించే
మాల వేసే స్వాముల చూస్తే మనస్సు నాకు పులకరించే
నాకు తెలియకుండ నాలో - నాకు తెలియకుండ నాలో
స్వామి శరణమొస్తా వుంది - స్వామి శరణమొస్తా వుంది ॥భూతనాథా॥
నే చేసే పూజలందు ఏమి లోపముందో ఏమో
నే పాడే పాటలల్లో ఎన్ని తప్పులున్నాయోమో
నేరుగ నీవు రాకపోయినా - నేరుగ నీవు రాకపోయినా
కలలకొచ్చి చెప్పావయ్యా - కలలకొచ్చి చెప్పావయ్యా ॥భూతనాథా॥
అర్చకున్ని కాను నేను అర్భకున్ని నేనయ్యా
అర్చకున్ని కాను నేను అర్భకున్ని నేనయ్యా
అనాథనని ఆదుకోరా - అనాథనని ఆదుకోరా
భూత నాథ అయ్యప్ప - భూత నాథ అయ్యప్ప ॥భూతనాథా॥
భూత నాథ సదా నందుడా సర్వ భూత దయాకరా
భూత నాథ సదా నందుడా సర్వ భూత దయాకరా
రక్ష రక్ష మహానుభావ రక్ష రక్ష మహానుభావ
స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప