Ayyappa App
డౌన్‌లోడ్ యాప్

ఊగే ఉయ్యాలకు అందమొచ్చెరా

🎤 గాయకుడు: గంగపుత్ర నర్సింగ్ రావు
🎤 రచయిత: గంగపుత్ర నర్సింగ్ రావు

ఊగే ఉయ్యాలకు అందమొచ్చెరా
మా చిన్ని మణికంఠుడు ఊయలూగగా
ఊగే ఉయ్యాలకు అందమొచ్చెరా                                                ||కోరస్||
మా చిన్ని మణికంఠుడు ఊయలూగగా
నీ తల్లి ఆ హరియే జోల పాట పాడగా
నీ తల్లి ఆ హరియే జోల పాట పాడగా
ముక్కోటి దేవతలే వంతు పాడగా                                                 ॥ఊగే ఉయ్యాలకు


ఆ ఆది శేషుడే ఉయ్యాల తాడుగా
ఆ నింగి మబ్బులన్ని సుగుణ దూదెపరుపులా
ఆ ఆది శేషుడే ఉయ్యాల తాడుగా
ఆ నింగి మబ్బులన్ని సుగుణ దూదెపరుపులా
ఆ సూర్య చంద్రులే నుదుట బుగ్గ చుక్కలుగా...                                ॥ఊగే ఉయ్యాలకు


కోకిల చిలకమ్మలు వేద పండితులుగా
కానల్లో ప్రతి జీవి సోదర బంధువులుగా
కోకిల చిలకమ్మలు వేద పండితులుగా
కానల్లో ప్రతి జీవి సోదర బంధువులుగా
చల్లని అడవి తల్లి నిండుగ ముత్తైదుగా                                           ॥ఊగే ఉయ్యాలకు


ఆ బ్రహ్మా మహేంద్రులు బాలుని దీవించగా
సురులు మునులంతా వేదము పఠియించగా
ఆ బ్రహ్మా మహేంద్రులు బాలుని దీవించగా
సురులు మునులంతా వేదము పఠియించగా
మణికంఠాయని ఆ మహేశ్వరుడు మురియగా                                    ॥ఊగే ఉయ్యాలకు

← భజన పాటల జాబితాకు తిరిగి వెళ్ళండి