పుట్టెడు దుఃఖము ఉన్నా గాని అయ్యా అయ్యప్పో - నా స్వామీ అయ్యప్పో
పుట్టెడు దుఃఖము ఉన్నా గాని అయ్యా అయ్యప్పో - నా స్వామీ అయ్యప్పో ||పుట్టెడు దు:ఖము|| ॥కోరస్॥
తండ్రివని నిన్ననుకున్నా తనయుడని నన్ననుకోరా
తండ్రివని నిన్ననుకున్నా తనయుడని నన్ననుకోరా ॥కోరస్॥
తాళలేను కష్టాలన్నీ అయ్యా అయ్యప్పా
తాళలేను కష్టాలన్నీ అయ్యా అయ్యప్పా ॥కోరస్॥
నీ ఒడిలో నన్ను ఓదార్చయ్యా స్వామి అయ్యప్పా ||పుట్టెడు దు:ఖము||
కష్టాలన్ని ఒక్కసారిగా కట్ట కట్టుకొచ్చిన గాని
కష్టాలన్ని ఒక్కసారిగా కట్ట కట్టుకొచ్చిన గాని ॥కోరస్॥
కళ్ళార నిన్నే చూడా అయ్యా అయ్యప్పా
కళ్ళార నిన్నే చూడా అయ్యా అయ్యప్పా ॥కోరస్॥
నీ కొండా నడిచి వస్తానయ్య స్వామీ అయ్యప్పా ||పుట్టెడు దు:ఖము||
కురిసేటి జల్లుల వోలే కారేటి కన్నీటితో
కురిసేటి జల్లుల వోలే కారేటి కన్నీటితో ॥కోరస్॥
" నీవి కడిగీ వస్తా అయ్యా అయ్యప్పా
కాళ్ళు నీవి కడిగి వస్తా అయ్యా అయ్యప్పా ॥కోరస్॥
నీ కడుపులోన దాచుకోరా స్వామి అయ్యప్పా ||పుట్టెడు దు:ఖము||
కష్టముంది పోకురా బిడ్డా అంటూ అమ్మ అంటున్నా
దారిలో భద్రం కొడుకా అంటూ అయ్యా చెబుతున్నా ॥కోరస్॥
ఎందరొద్దన్నా గాని అయ్యా అయ్యప్పా
ఎందరొద్దన్నా గాని అయ్యా అయ్యప్పా ॥కోరస్॥
వట్టి చేతులతో పంపకురా నా స్వామి అయ్యప్పా ||పుట్టెడు దు:ఖము||