కొండలన్ని దాటి దాటి అడవులన్ని నడిచి నడిచి
కొండలన్ని దాటి దాటి అడవులన్ని నడిచి నడిచి
నిన్ను నే చూడావస్తే అయ్యప్పా.... నిముషమైన చూడనివ్వరే అయ్యప్పా
నిన్ను నిముషమైన చూడనివ్వరే అయ్యప్పా
నేనేమి చేశాను పాపం ఇది ఏ జన్మలోని శాపం
నేనేమి చేశాను పాపం ఇది ఏ జన్మలోని శాపం ||కొండలన్ని||
మళ్లీ నిన్ను చూడాలంటే మల్ల ఏడు రావాల - మనసులోన దేవుడ నిన్ను నేనెట్టా మరవాల || 2 ||
ఇంతలోనే ఏమవుతుందో జీవితం... కాదు కదరా ఇది శాశ్వతం || 2 ||
నేనేమి చేశాను పాపం ఇది ఏ జన్మలోని శాపం
నేనేమి చేశాను పాపం ఇది ఏ జన్మలోని శాపం ||కొండలన్ని||
గుండెలోనే బాధ నిండగ కంట నిండ నీరు కారగ - ముద్రలోన నెయ్యి పోయగా కంట నీరు పడ్డాయేమో || 2 ||
కరుణించి కాపాడయ్య అయ్యప్పా... కనులార చూడనివ్వరు అయ్యప్ప || 2 ||
నేనేమి చేశాను పాపం ఇది ఏ జన్మలోని శాపం
నేనేమి చేశాను పాపం ఇది ఏ జన్మలోని శాపం ||కొండలన్ని||
పాప మోక్షం పొందాలంటే పడిమెట్లనే ఎక్కాలంటా - ఒక్క మెట్టు ఎక్కే లోపు రెక్క పట్టి లాగేశారే || 2 ||
అంత పాపమేమి చేశానయ్య అయ్యప్పా - పాపమెట్ల పోయేదయ్యా అయ్యప్పా || 2 ||
నేనేమి చేశాను పాపం ఇది ఏ జన్మలోని శాపం
నేనేమి చేశాను పాపం ఇది ఏ జన్మలోని శాపం ||కొండలన్ని||
కన్నవారినందరిని వదిలి కట్టుకున్న ఇల్లాలు నొదిలి - భారమంతా నీపై ఉంచి నిన్ను చూసి వస్తానని || 2 ||
నిన్ను చూడ వచ్చానయ్యా అయ్యప్పా - చూడకుండ ఎట్టా పోను అయ్యప్పా || 2 ||
నేనేమి చేశాను పాపం ఇది ఏ జన్మలోని శాపం
నేనేమి చేశాను పాపం ఇది ఏ జన్మలోని శాపం ||కొండలన్ని||