అమ్మా నాన్నలు ఇలలోన దైవమూ
మీ రూపాలను మరువబోము మేమెన్నడు
అమ్మా నాన్నలు ఇలలోన దైవమూ
మీ రూపాలను మరువబోము మేమెన్నడు
మీ ఆశీస్సులు నడిపించును జీవితాంతము మీ ఆశీస్సులు నడిపించును జీవితాంతము
మొక్కులెన్నో మొక్కుకొని మాకు జన్మిచ్చారు
కోటీ ఆశలతో వీరు కలలెన్నో కన్నారు
మొక్కులెన్నో మొక్కుకొని మాకు జన్మిచ్చారు
కోటి ఆశలతో వీరు కలలెన్నో కన్నారు
పుట్టెడు దు:ఖములో ఉన్న .... ఆ....
పుట్టెడు దు:ఖములో ఉన్న ప్రేమ పంచినది అమ్మ
కాయా కష్టాలు చేసి పోషించితివి నాన్న ॥అమ్మ నాన్నలు||
కంటికి రెప్పోలే ఉండి పెంచి పెద్ద చేశారు
అమ్మ నాన్నలను మించి భువిలో ఏమి లేనే లేదు
కంటి రెప్పోలే ఉండి పెంచి పెద్ద చేశారు
అమ్మ నాన్నలను మించి భువిలో ఏమీ లేనే లేదు
తల్లిదండ్రుల సేవా..... ఆ...
తల్లి తండ్రుల సేవ ఆశీస్సుల రక్షణలై
ఎన్ని జన్మలైన మా గుండెలో కొలువుంటారు ॥అమ్మ నాన్నలు||
కనిపించే దేవుళ్లే అమ్మ నాన్న రూపాలు
ఏనాటిదో ఈ బంధం దేవుడిచ్చిన అనుబంధం
కనిపించే దేవుళ్లే అమ్మ నాన్న రూపాలు
ఏనాటిదో ఈ బంధం దేవుడిచ్చిన అనుబంధం
ఏమిచ్చిన గాని మేము..... ఓ....
ఏమిచ్చిన గాని మేము మీ ఋణము తీర్చలేము
మళ్లీ జన్మంటు ఉంటే మీ కడుపునే పుట్టాలి ॥అమ్మ నాన్నలు||