భూతనాథ సదానందా అయ్యప్పా... సర్వభూత దయాకరా అయ్యప్పా....
భూతనాథ సదానందా అయ్యప్పా... సర్వభూత దయాకరా అయ్యప్పా.... ॥కోరస్॥
మాదంటూ ఏదీ లేని మేమంతా నీదయని - దీవిలో భువిలోన మా తోడూ నీవేనని
మాదంటూ ఏదీ లేని మేమంతా నీదయని - దీవిలో భువిలోన మా తోడూ నీవేనని ॥కోరస్॥
ఏ పూర్వ పుణ్యమో గాని అయ్యప్పా - నీ మాలను వేసినాను అయ్యప్పా
ఏ పూర్వ పుణ్యమో గాని అయ్యప్పా - నీ మాలను వేసినాను అయ్యప్పా ॥కోరస్॥ ॥ భూతనాథ ॥
శరణన్న వారికి స్వామి మరణాలే లేవంటూ- దీవెన లిచ్చే స్వామి దీవించ రావేమి
శరణన్న వారికి స్వామి మరణాలే లేవంటూ - దీవెన లిచ్చే స్వామి దీవించ రావేమి ॥కోరస్॥
అందాల స్వామివి నీవే అయ్యప్పా - పందళ రాజ కుమార అయ్యప్పా
అందాల స్వామివి నీవే అయ్యప్పా - పందళ రాజు కుమార అయ్యప్పా ॥కోరస్॥ ॥ భూతనాథ ॥
పంబానది తీరములోన పందళ రాజుకి నీవు - పసి బాలుని రూపాన దొరికిన దేవుడవయ్య
పంబానది తీరములోన పందళ రాజుకి నీవు - పసి బాలుని రూపాన దొరికిన దేవుడవయ్య ॥కోరస్॥
నీ పాటలు పాడినాము అయ్యప్పా - నీ ఆటలు ఆడామయ్య అయ్యప్ప
ప్రతి ఏట వస్తామయ్య అయ్యప్పా - నీ నామము మరువమయ్య అయ్యప్ప ॥కోరస్॥ ॥ భూతనాథ ॥
కాషాయం కట్టినాము వేశాలే మార్చినాము - నియమాల నీ మాల మెడలోనా వేసామయ్య
కాషాయం కట్టినాము వేశాలే మార్చినాము - నియమాల నీ మాల మెడలోనా వేసామయ్య ॥కోరస్॥
ఏ పూర్వ పుణ్యమో గాని అయ్యప్పా - నీ పూజలు చేసినాము అయ్యప్పా
ఏ పూర్వ పుణ్యమో గాని అయ్యప్పా - నీ పూజలు చేసినాము అయ్యప్పా ॥కోరస్॥ ॥ భూతనాథ ॥
ఏదీ మాదీ కాదు పోయింది మళ్ళీ రాదు - పయనుంచి నీ సన్నిధి చేరాము క్షేమంగా
ఏదీ మాదీ కాదు పోయింది మళ్ళీ రాదు - పయనుంచి నీ సన్నిధి చేరాము క్షేమంగా ॥కోరస్॥
ఇరుముడులే తెచ్చాము మా అయ్యప్పా - నెయ్యాభిషేకం నీకే అయ్యప్పా
కర్పూర దీపం నీకే అయ్యప్పా - నీ జ్యోతి దర్శనం మాకయ్యప్పా ॥కోరస్॥ ॥ భూతనాథ ॥