బుజ్జి బుజ్జి గణపయ్య బొజ్జ గణపయ్య - శరణు గణేశ శరణాలయ్య
బుజ్జి బుజ్జి గణపయ్య బొజ్జ గణపయ్య - శరణు గణేశ శరణాలయ్య
ముజ్జగాలు ఏలె కన్నెమూల గణపయ్య - శరణు గణేశ శరణాలయ్య
ముజ్జగాలు ఏలె కన్నెమూల గణపయ్య - శరణు గణేశ శరణాలయ్య ||కోరస్|| ||బుజ్జి బుజ్జి||
పంచానది తీరాన వెలుగుతున్నావయ్య - శరణు గణేశ శరణాలయ్య ॥2॥ ॥కోరస్॥
పంచాగిరి వాసునికి తోడుగున్నావయ్య - శరణు గణేశ శరణాలయ్య ||కోరస్||
మకర జ్యోతి సంబరాలు సేవలు పూజలు చేయంగా
ముసి ముసి నవ్వుల మోహిని బాలుడు నీతో ముచ్చట లాడంగ ||కోరస్|| ||బుజ్జి బుజ్జి||
కాణిపాకమందు బావిలోన పుడితివయ్య - శరణు గణేశ శరణాలయ్య ॥2॥ ॥కోరస్॥
శ్రీశైల కొండల్లోన సాక్షివైనావయ్య - శరణు గణేశ శరణాలయ్య ॥2॥ ॥కోరస్॥
ఆది పూజల నా స్వామి వందనాలు గణపయ్య
ఆపద మొక్కుల వాడ మూషిక వాహనమెక్కి రావయ్య ||కోరస్|| ||బుజ్జి బుజ్జి||
మొదటి పూజ చేయకుంటే నీకు కోపమయ్య - శరణు గణేశ శరణాలయ్య ॥2॥ ॥ కోరస్॥
ముప్పతిప్పలెన్నో పెట్టి మురిసిపోతవయ్య - శరణు గణేశ శరణాలయ్య ॥2॥ ॥ కోరస్॥
ఏకదంతా గణనాథ శివగౌరీ తనయ రావయ్య
సిద్ధి బుద్ధి విఘ్నేశ మా విఘ్నాలన్నీ బాపయ్య || బుజ్జి బుజ్జి ||
ముజ్జగాలు ఏలే కన్నెమాల గణపయ్య
శరణు గణేశ శరణాలయ్య ॥ కోరస్॥
శరణు గణేశ శరణాలయ్య ॥ కోరస్॥
శరణు గణేశ శరణాలయ్య ॥ కోరస్॥