చుట్టూ ముట్టూ హైదరాబాద్ నట్టా నడుమ చార్మినార్,
చార్మినార్ కొమ్ము కింద నువ్వు కొలువు దీరినావే బంగారు మైసమ్మ
నువ్వు కొలువు దీరినావే బంగారు మైసమ్మ ||కోరస్||
నీ శక్తి చూప రావే బంగారు మైసమ్మ ||కోరస్||
నీ శక్తి చూప రావే బంగారు మైసమ్మ ॥చుట్టూ ముట్టూ॥
వచ్చే వారికి వరాలిచ్చి పోయే వారికి దీవెనలిచ్చి
స్వచ్ఛమైన తల్లివని చక్కనైన బాట చూపి
వచ్చే వారికి వరాలిచ్చి పోయే వారికి దీవెనలిచ్చి ||కోరస్||
సత్యమైన తల్లివని చక్కానైన బాట చూపి
వచ్చీపోయే భక్తులంతా కోరి కోరి మొక్కెరంటా
వచ్చీపోయే భక్తులంతా కోరి కోరి మొక్కెరంటా ||కోరస్||
నిన్ను చూడ తరము కాదే...
మా కదర గొట్టినావే బంగారు మైసమ్మ
మా కదర గొట్టినావే బంగారు మైసమ్మ ॥చుట్టూ ముట్టూ॥
మంత్రగాళ్లు వచ్చిరంటా మాయలెన్నో చేసిరంటా
యంత్రాలు దాల్చిరంట అమ్మా నిన్ను లేపిరంటా
మంత్రగాళ్లు వచ్చిరంటా మాయలెన్నో చేసిరంటా ||కోరస్||
యంత్రాలు దాల్చిరంట అమ్మా నిన్ను లేపిరంటా
దున్నపోతులు మేకపోతులు నరబలి నీకిచ్చిరంటా ||కోరస్||
దున్నపోతులు మేకపోతులు నరబలి నీకిచ్చిరంటా
కత్తెర మీద కత్తెర లేపీ....
నువ్వు గట్లు తెంపినావే బంగారు మైసమ్మ
నువ్వు గట్లు తెంపినావే బంగారు మైసమ్మ ||కోరస్|| ॥చుట్టూ ముట్టూ॥
హుస్సేన్ సాగర్ కట్ట కింద ఉరిమి ఉరిమి చూస్తివంట
గండిపేట చెరువు కాడ గావు కేక వేస్తివంట
హుస్సేన్ సాగర్ కట్ట కింద ఉరిమి ఉరిమి చూస్తివంట ||కోరస్||
గండిపేట చెరువు కాడ గావు కేక వేస్తివంట
గోలుకొండ ఖిల్లా కాడ గుండెలదర కొడితీవంటా
గోలుకొండ ఖిల్లా కాడ గుండెలదర కొడితీవంటా ||కోరస్||
బల్కంపేటలోన నీవే...
బావిలో పుట్టినావే బంగారు ఎల్లమ్మ ||కోరస్||
బావిలో పుట్టినావే బంగారు ఎల్లమ్మ ॥చుట్టూ ముట్టూ॥