దిగు దిగు దిగు నాగ నాగన్న - దివ్య సుందరి నాగో నాగన్న
దిగు దిగు దిగు నాగ నాగన్న - దివ్య సుందరి నాగో నాగన్న || దిగు దిగు ||
అటు కొండ ఇటు కొండ నాగన్న - నడుమ నాగుల కొండో నాగన్న
కొండలో ఉన్నావ నాగన్న - కోడె నాగు వయ్యో నాగన్న || దిగు దిగు ||
ఇల్లలికి ముగ్గు పెట్టి నాగన్న - ఇంటా మల్లెలు జల్లి నాగన్న
మల్లెల వాసనకు నాగన్న - కోలాట మాడి పోరా నాగన్న || దిగు దిగు ||
భామాలంతా కలసి నాగన్న - బావి నీళ్లకెలితే నాగన్న
బావిలో ఉన్నవా నాగన్న బాలా నాగువయ్యో నాగన్న || దిగు దిగు ||
పిల్లలంతా కలసి నాగన్న - పుల్లాలేరబోతే నాగన్న
పుల్లలో ఉన్నవా నాగన్న - పిల్లా నాగువయ్యో నాగన్న || దిగు దిగు ||
పూలు పండ్లు తెచ్చి నాగన్న - పుట్ట ముందుఉంచా నాగన్న
పుట్టలో ఉన్నావ నాగన్న కోడే నాగువయ్యో నాగన్న || దిగు దిగు ||
పిల్లల కోసమని నాగన్న - నీ పూజ చేశాము నాగన్న
పిల్లలు పుడితేను నాగన్న - నీ పేరు పెడతాను నాగన్న || దిగు దిగు ||
స్వాములంతా కలసి నాగన్న - పువ్వులేరబోతే నాగన్న
పూలల్లో ఉన్నావా నాగన్న - నల్లా నాగువయ్యో నాగన్న || దిగు దిగు ||
భక్తులంతా చేరి నాగన్న - భజనలు చేస్తుంటే నాగన్న
పూజకు రావయ్యో నాగన్న - దీవించి పోవయ్యో నాగన్న || దిగు దిగు ||