Ayyappa App
డౌన్‌లోడ్ యాప్

గణనాథ ఏలుమయ

🎤 గాయకుడు: నర్సింగి నర్సింగ్ రావు
🎤 రచయిత: నర్సింగి నర్సింగ్ రావు

గణనాథ ఏలుమయ ఎంతటి చల్లని స్వామివయా..
భజియింతు నీ నామమే దేవా - పాలించ రావేమయా.. llకోరస్ll
గణనాథ ఏలుమయ ఎంతటి చల్లని స్వామివయా..
భజియింతు నీ నామమే దేవా - పాలించ రావేమయా.. llగణనాథll

అనతీ తల్లిది నువ్వు వినగానే - ఆజైకై ఉంటివి స్వామి llకోరస్ll
అనతీ తల్లిది నువ్వు వినగానే - ఆజైకై ఉంటివి స్వామి
శివుడే వచ్చిన బెదరక నీవు - శక్తి తోడ నీవే ఎదిరించినావే
శివుడే వచ్చిన బెదరక నీవు - శక్తి తోడ నీవే ఎదిరించినావే llకోరస్ll
ఎంతటి వీరుడ నిన్నూ మరువజాలం - ఏమని పొగడము నీ లీల సారం
నేనంత వాడనయా - దేవా - పాలించ రావేమయా llగణనాథll

నీ పుణ్య నామము తలచిన చాలు - నిను కొలిచిన స్వామి కలుగు మేలు
నీ పుణ్య నామము తలచిన చాలు - నిను కొలిచిన స్వామి కలుగు మేలు llకోరస్ll
నీ బొజ్జ రూపం ఆనంద తేజం - భవ సాగరముల దొరుకును తీరం
నీ బొజ్జ రూపం ఆనంద తేజం - భవ సాగరముల దొరుకును తీరం llకోరస్ll
ప్రతి దినం నిన్ను తలచిన వాళ్ళం - పాడుకొందుము ప్రభు నీదు నామం
మా ఇలవేల్పువయా స్వామి లాలించ రావేమయా llగణనాథll

← భజన పాటల జాబితాకు తిరిగి వెళ్ళండి