గురుబోధ లేనిదే అంధకారమే - గురుస్వామి లేని అంతా శూన్యమే
గురుబోధ లేనిదే బ్రతుకే భారం - గురుస్వామి లేనిదే ఏమున్నా వ్యర్థం
గురువు లేని విద్య అది గుడ్డి విద్యరా
గ్రహించలేని వాడు పాపాత్ముడేనురా llగురుబోధll
కలిమిలేములు కష్టసుఖాలు రెండు - ఎదురవ్వని వాడు మనిషే కాడు
మనసు లేని వాడు ధనమున్న దరిద్రుడు - ఆదరించే పేదోడు ఆ పరమేశ్వరుడు
ఎన్నెన్నో తెలిపినావు గురుస్వామి - పరమార్థాన్ని చెప్పినావు గురుస్వామి
ఎన్నెన్నో తెలిపినావు గురుస్వామి - పరమార్థాన్ని చెప్పినావు గురుస్వామి llగురుబోధll
మానవ జన్మం ఎంతో మధురం అన్నారు - ప్రాణి కోటి లోనే అది ఉత్తమమన్నారు
శరీరానికి మాత్రమే వికలాంగమన్నారు - మానవత్వమున్నవాడు పరబ్రహ్మ అన్నారు
అయ్యప్ప దీక్షలోన ఓ గురుస్వామి - మా కన్నియును నేర్పినావు ఓ గురుస్వామి
అయ్యప్ప దీక్షలోన ఓ గురుస్వామి - మా కన్నియును నేర్పినావు ఓ గురుస్వామి llగురుబోధll
గర్వం ఈర్ష్యలు మాకు సూపొద్దన్నారు - అందరి హృదయాలను గెలవాలన్నారు
దయా ధర్మం లేనివాడు మృగమేనన్నారు - ఆదుకునే ప్రతి మనిషి ఆది విష్ణువన్నారు
ఎన్ని జన్మలెత్తినా మా గురుస్వామి - ఏ ఋణము తీర్చుకోలేము నా గురుస్వామి
ఎన్ని జన్మలెత్తినా మా గురుస్వామి - ఏ ఋణము తీర్చుకోలేము నా గురుస్వామి llగురుబోధll
అహం ఆశలు రెండు శత్రువులన్నారు - అజ్ఞానం వదిలి నీవు జ్ఞానం పొందన్నారు
బ్రహ్మ విష్ణు శివ రూపం మీరేనయ్య - మా జీవితాన్ని తీర్చిదిద్దే మార్గదర్శిగా
సకల దేవతల రూపం మీరే గురుస్వామి - తల్లి తండ్రి తరువాత స్థానం మీదే స్వామి
సకల దేవతల రూపం మీరే గురుస్వామి - తల్లి తండ్రి తరువాత స్థానం మీదే స్వామి llగురుబోధll