జీవితమే నీటి బుడగరా జీవమా
ఇది అక్షర సత్యమాయే తెలుసుకొనుమా
అక్షర సత్యమాయే తెలుసుకొనుమా
ఇది కలికాల నిజమని తెలుసుకొనుమా
ఇది అక్షర సత్యం మా అమ్మా చెప్పెను నిత్యం

ఆట బొమ్మలాట కాదురా జీవితం
ఇది ఆడుకునే అమ్మ ఒడికాదు జీవితం
న్యాయమన్న మాటకు విలువా లేదురా
నేడు అన్యాయమన్న మాటకే ఉందిరా
ఇది అక్షర సత్యం మా అమ్మా చెప్పెను నిత్యం
ఇది అక్షర సత్యం మా అమ్మా చెప్పెను నిత్యం
ధర్మానికి దారి లేదురా జీవమా
నేడు న్యాయానికి కళ్లు లేవురా జీవమ
మాటకే విలువ లేని ఈ లోకంలో
పైసకే విలువనిస్తున్నారు చూడరా
ఇది అక్షర సత్యం మా అమ్మా చెప్పెను నిత్యం
ఇది అక్షర సత్యం మా అమ్మా చెప్పెను నిత్యం
నాది నీదంటు ఏమి లేదు జీవమా
చివరకు మనమేమి తీసుకుపోలేము జీవమా
చేసిన పుణ్యాలే మనకు అండరా
అది ముక్తి మార్గము చూపిస్తుందిరా
ఇది అక్షర సత్యం మా అమ్మా చెప్పెను నిత్యం
ఇది అక్షర సత్యం మా అమ్మా చెప్పెను నిత్యం
జీవితమే నీటి బుడగరా జీవమా
ఇది అక్షర సత్యమాయే తెలుసుకొనుమా
అక్షరా సత్యమాయే తెలుసుకొనుమా