Ayyappa App
డౌన్‌లోడ్ యాప్

మనసులో బాధ ఉంటే

🎤 గాయకుడు: నార్సింగి నర్సింగ్ రావు గురుస్వామి
🎤 రచయిత: నార్సింగి నర్సింగ్ రావు గురుస్వామి

మనసులో బాధ ఉంటే భజన ఎలా చేయను
గుండెనే బరువైతే కొండకెలా చేరను
మనసులో బాధ ఉంటే భజన ఎలా చేయను
గుండెనే బరువైతే కొండకెలా చేరను
ఒంటిలో శక్తి లేదు ఎంత సేపు నడవను
కాలమే కాటు వేస్తే ప్రాణమెలా నిలుచును
మట్టిలో కలిసే దేహమే ఇదీ... లేని పోని ఆశలు రేపిన విధి
పూజతో పాపం దక్కిందా... గుండెలో గాయం మిగిలిందా
పూజతో పాపం దక్కిందా... గుండెలో గాయం మిగిలిందా                                         ॥మనస్సులో బాధ॥

చిన్ననాటి నుండి మాల తోడు ఒక్కటే...
నీడలాగ వెంట ఉంది కష్టమొక్కటే...                                                               ॥ 2 ॥
కొండలంటే కొత్తేమీ కాదు - బాధ నాకు వింతేమి కాదు
ఇప్పుడున్న గుండెకోత ముందు ఎరగను..
చెప్పుకుంటే తగ్గేది కాదు.. పంచుకునే తోడంటు లేదు
అంతులేని దారిలోన ఎంత నడవను
ఇది నాలో దోషమా... అది దేవుని శాపమా..
విధి ఆడే జూదమా.. ఆ ... దేవుడంటే మాయేనా...                                                ॥మనస్సులో బాధ॥

నాకు బాధ కలిగినపుడు నీవు లాలనా..
సంతోష సమయాన నిన్ను కొలవనా.                                                                 ॥ 2 ॥
చల్లనైన పాదాల చెంత... పువ్వునై నేనుండిపోనా
భాగ్యమింక జన్మలోన నాకు లేడులే...
జన్మ అంటు ఇంకొక్కటుంటే కర్పూరములా కరిగిపోనా
కన్ను కడతేర నివ్వు పాద పూజలో...
నా ప్రాణం నీవేలే... నా ధ్యానము నీవేలే
నా సర్వం నీవేలే... ఏ.. దయతో చూడవయా..                                                    ॥మనస్సులో బాధ॥

← భజన పాటల జాబితాకు తిరిగి వెళ్ళండి