నాగరాజ నాగరాజ బుసలు కొట్టే నాగరాజ
నాగరాజ నాగరాజ బుసలు కొట్టే నాగరాజ ||కోరస్||
పుట్టలోన దాగి ఉన్నావ ఓ నాగరాజ పూజలందుకోగ రావయ్య ||నాగరాజ||
నందునికి మిత్రుడవయ్య కమ్మని పాలు తాగావయ్య
నందునికి మిత్రుడవయ్య కమ్మని పాలు తాగావయ్య ||కోరస్||
పాల కడలి చిలికినపుడు తాడుగాను మారావయ్య
పాల కడలి చిలికినపుడు తాడుగాను మారావయ్య ||కోరస్||
శివుడి మెడలో హారమైనావా ఓ నాగరాజ విష్ణుమూర్తి పాన్పువయ్యావా ||నాగరాజ||
నాగ పంచమి నాగుల చవితి పండగైన రోజులు నీకు
నాగ పంచమి నాగుల చవితి పండగైన రోజులు నీకు ||కోరస్||
పూలు పండ్లు పాలు తెచ్చి పుట్ట ముందు పూజలు చేశా
పూలు పండ్లు పాలు తెచ్చి పుట్ట ముందు పూజలు చేశా ||కోరస్||
భక్తితోడ నిన్ను కొలిచాము ఓ నాగరాజ మా కోర్కెలన్ని తీర్చ రావయ్య ||నాగరాజ||
శబరిగిరి యాత్రలోన మా తోడు నీడ నీవేనయ్య
శబరిగిరి యాత్రలోన మా తోడు నీడ నీవేనయ్య ||కోరస్||
నాదస్వరము ఊదామయ్య పరవశించి ఆడవయ్య
నాదస్వరము ఊదామయ్య పరవశించి ఆడవయ్య ||కోరస్||
సర్పదోషం పూజ చేశాము ఓ నాగరాజ చక్కనైన దీవనీయవయ్య ||నాగరాజ||