Ayyappa App
డౌన్‌లోడ్ యాప్

నవ మాసాలు మోసిన తల్లి

🎤 గాయకుడు: నార్సింగి నర్సింగ్ రావు గురుస్వామి
🎤 రచయిత: నార్సింగి నర్సింగ్ రావు గురుస్వామి

నవ మాసాలు మోసిన తల్లి ప్రేమకే దూరమా !
బువ్వ పెట్టి నను బుజ్జగించిన తల్లి లాలనకు దూరమా
నవ మాసాలు మోసిన తల్లి ప్రేమకే దూరమా !
బువ్వ పెట్టి నను బుజ్జగించిన తల్లి లాలనకు దూరమా                                                    ||నవ మాసాలు||

పొద్దు వాలుతుందీ నాకమ్మ లాలనేది - పొద్దు వాలుతుందీ నాకమ్మ లాలనేది                         ||కోరస్||
వెన్నెల రాతిరిలో నీ గోరు ముద్దలేవీ - వెన్నెల రాతిరిలో నీ గోరు ముద్దలేవీ                            ||కోరస్||
చల్లనైన నీ వడిలో నిద్దుర కరువాయేనమ్మ - ఈ భువిలోన జన్మకు అర్థం లేనేలేదమ్మ
ఓ తల్లీ నీ జోల పాట లేక కంటికి కునుకే రాదమ్మ
ఓ తల్లీ నీ జోల పాట లేక కంటికి కునుకే రాదమ్మ                                                ||కోరస్||  ||నవ మాసాలు||


నా లేత గుండెలోన తీరని బాధను నింపావు - నా లేత గుండెలోన తీరని బాధను నింపావు                        ||కోరస్||

చిన్నారి కన్నులలో కన్నీరు నింపావు - చిన్నారి కన్నులలో కన్నీరు నింపావు                                       ||కోరస్||
తిరిగి రాని తీరాలకు వెళ్లి ఒంటరి చేశావు - బ్రతుకును బాధతో నింపావు
ఓ తల్లీ నీ జోల పాట లేక కంటికి కునుకే రాదమ్మ
ఓ తల్లీ నీ జోల పాట లేక కంటికి కునుకే రాదమ్మ                                                ||కోరస్||  ||నవ మాసాలు||

నాన్న ఉన్నడమ్మ నాకు జోల పాడగల - నాన్న ఉన్నడమ్మ నాకు జోల పాడగలడా                             ||కోరస్||

కన్న తండ్రి అయినా యదతో పాలు ఇవ్వగలడా - కన్న తండ్రి అయినా యదతో పాలు ఇవ్వగలడా
తోడు లేని ఈ జన్మం నాకు నరకము ఓయమ్మ - రాత రాసిన బ్రహ్మ దేవుడు పాపపువాడమ్మ
ఓ తల్లీ నీ జోల పాట లేక కంటికి కునుకే రాదమ్మ                                                ||కోరస్||   ||నవ మాసాలు||

దేవుడు లేడనే మనుషులు ఉన్నారు - దేవుడు లేడనే మనుషులు ఉన్నారు                                     ||కోరస్||
అమ్మే లేదనే వాడు లోకాననే లేడు - అమ్మే లేదనే వాడు లోకాననే లేడు                                         ||కోరస్||
అమ్మ ఉన్న ఇంటిలోన లేనిది ఏముంది - నా అమ్మ ఒడిలో ఒరిగితే నాకు స్వర్గములున్నట్లుంది.
ఓ తల్లీ నీ జోల పాట లేక కంటికి కునుకే రాదమ్మ ఓ తల్లీ నీ జోల పాట లేక కంటికి కునుకే రాదమ్మ
ఓ తల్లీ నీ జోల పాట లేక కంటికి కునుకే రాదమ్మ
ఓ తల్లీ నీ జోల పాట లేక కంటికి కునుకే రాదమ్మ                                                   ||కోరస్||   ||నవ మాసాలు||

← భజన పాటల జాబితాకు తిరిగి వెళ్ళండి