ప్రాణమున్నంత వరకు నా అయ్యప్ప నీ నామం మరువమయ్య మా అయ్యప్ప
ప్రాణమున్నంత వరకు నా అయ్యప్ప నీ నామం మరువమయ్య మా అయ్యప్ప
ఇరుముడి ఎత్తుకొచ్చినాం - మా అయ్యప్ప ॥ 2 ॥
ముడుపులొప్ప జెప్ప వచ్చినం - మా అయ్యప్ప ॥ 2 ॥ ॥ప్రాణామున్నంత॥
కార్తీకములోనా నీ జాతర చూడా - అంబరాన్నంటే శరణు ఘోష సంబరమయ్య
అంబరాన్నంటే శరణు ఘోష సంబరమయ్య ||కోరస్||
చెట్టు పుట్టల్లోన వాగు వంకల్లోన - స్వాములంతా అడవిలోన నిండుగనయ్య
స్వాములంతా అడవిలోన నిండుగనయ్య ||కోరస్||
ఎరుమేలి కొండకొచ్చినాం - మా అయ్యప్ప ॥ 2 ॥
చీకట్లడవిలో నడిచినాం - మా అయ్యప్ప ॥ 2 ॥
ఇరుముడి ఎత్తుకొచ్చినాం - మా అయ్యప్ప ॥ 2 ॥
ముడుపులొప్ప జెప్ప వచ్చినం - మా అయ్యప్ప ॥ 2 ॥ ॥ప్రాణామున్నంత॥
తిండి తిప్పలు లేక కొండలన్ని తిరిగినాం - గుట్టలెక్కి దిగీ స్వామి మూర్ఛపోయినాం
గుట్టలెక్కి దిగీ స్వామి మూర్చపోయినాం ||కోరస్||
దట్టమైన అడవిలోన దారి దొరకదేమి దయ చూపి మాకు దారి చూపుము స్వామి
దయ చూపి మాకు దారి చూపుము స్వామి ||కోరస్||
క్రూరమైన అడవిలోన - మా అయ్యప్ప ॥ 2 ॥
కొన ఊపిరితో ఉంటిమి మా అయ్యప్ప ॥ 2 ॥
ఇరుముడి ఎత్తుకొచ్చినాం - మా అయ్యప్ప ॥ 2 ॥
ముడుపులొప్ప జెప్ప వచ్చినం - మా అయ్యప్ప ॥ 2 ॥ ॥ప్రాణామున్నంత॥