Ayyappa App
డౌన్‌లోడ్ యాప్

సుబ్రహ్మణయ్య స్వామి పాట

🎤 గాయకుడు: గానం: పి.కేశవ గురుస్వామి
🎤 రచయిత: గానం: పి.కేశవ గురుస్వామి

పళని మలై కొండ మీద పార్వతమ్మ కొడుక
నీకు పాల కావడి తెచ్చామయ్య పరుగున రారా ॥పళని మలై॥ ॥కోరస్||
స్వామి మలై కొండ మీద శంకర తనయ
నీదరి పూనకాల భక్తులతో వచ్చామయ్య ॥స్వామి మలై|| ||కోరస్||
హరోంహర హరోంహర హరోంహర హరహర
హరోంహర హరోంహర హరోంహర హరహర ॥కోరస్|| ॥పళని॥


వేళాయుధపాణి నీకు పాలాభిషేకం
స్వామి శూలాయుధ పాణి నీకు పూలాభిషేకం ॥వేళాయుధ॥ ॥ కోరస్ll
సర్పదోష పూజ చేశ సుబ్రహ్మణ్య
మా దోషాలు పోగొట్టు స్కందామురుగ ॥సర్పదోష|| ||కోరస్||
హరోంహర హరోంహర హరోంహర హరహర
హరోంహర హరోంహర హరోంహర హరహర ॥కోరస్|| ॥పళని॥


కావడినే మోసామయ్య కార్తికేయుడ
మా కష్టాలు తీర్చవయ్య వళ్లీ నాథ ॥కావడినే॥ ||కోరస్||
పానకాలు తెచ్చామయ్య పావన చరిత
మా పాపాలు కడతేర్చు బాల మురుగ ॥పానకాలు॥ ॥ కోరస్ ॥
హరోంహర హరోంహర హరోంహర హరహర
హరోంహర హరోంహర హరోంహర హరహర ॥కోరస్|| ॥పళని॥


పచ్చ నెమలి వాహనుడ పరుగున రారా
మా పూజలందుకోవయ్య స్వామి మురుగ ॥పచ్చనెమలి॥ ॥కోరస్||
దండాయుధ పాణి నీకు దండాలయ్య
దేవసేన పతి మమ్ము ఆదుకోవయ్య ॥దండాయుధ॥ ॥ కోరస్ ||
హరోంహర హరోంహర హరోంహర హరహర
హరోంహర హరోంహర హరోంహర హరహర ॥కోరస్|| ॥పళని॥

← భజన పాటల జాబితాకు తిరిగి వెళ్ళండి