స్వామి రా రారారా - అయ్యరా రారారా
స్వామి రా రారారా - అయ్యరా రారారా ||కోరస్||
స్వామి రా రారారా - అయ్యరా రారారా
స్వామి రా రారారా - అయ్యరా రారారా ||కోరస్||
మణిమాల ధారుడా - మహినేలే దేవుడా
నీ భక్తుల బ్రోవగా - కొండ దిగి రావయ్య ||స్వామి రారా||
శబరి మలై కొండల్లో కొలువై ఉన్నావా
శబరి మలై కొండల్లో కొలువై ఉన్నావా ||కోరస్||
నీలి మలై నీడల్లో నిలిచియున్నావా
నీలి మలై నీడల్లో నిలిచియున్నావా ||కోరస్||
పంబానదీ తీరాన పవళించి ఉన్నావా
పంబానదీ తీరాన పవళించి ఉన్నావా ||కోరస్||
పంబానదీ తీరాన పవళించి ఉన్నావా
పంబానదీ తీరాన పవళించి ఉన్నావా ||కోరస్||
అయ్యా ఓరయ్యా మా చెంత చేర రావయ్య ||స్వామి రారా||
పున్నాగలు సిరిమల్లెలు కాశి విరగబూసాయి
పున్నాగలు సిరిమల్లెలు కాశి విరగబూసాయి ||కోరస్||
పన్నీరు చిలకరించి పూలు మాలలు కట్టాము
పన్నీరు చిలకరించి పూలు మాలలుకట్టాము ||కోరస్||
నీ మెడలో ఉండాలని నీ సేవలు పొందాలని
నీ మెడలో ఉండాలని నీ సేవలు పొందాలని ||కోరస్||
నీ మెడలో ఉండాలని నీ సేవలు పొందాలని
నీ మెడలో ఉండాలని నీ సేవలు పొందాలని ||కోరస్||
కొండంత ఆశతోను దండగా మారాయి ||స్వామి రారా||
ప్రకృతంత నీ కోసం పులకరించి పోయింది
ప్రకృతంత నీ కోసం పులకరించి పోయింది ||కోరస్||
పాలు పళ్లు పటిక బెల్లం పాయశాలు తెచ్చాము
పాలు పళ్లు పటిక బెల్లం పాయశాలు తెచ్చాము ||కోరస్||
కస్తూరి గంధాలు అరగదీసుకొచ్చాము
కస్తూరి గంధాలు అరగదీసుకొచ్చాము ||కోరస్||
కస్తూరి గంధాలు అరగదీసుకొచ్చాము
కస్తూరి గంధాలు అరగదీసుకొచ్చాము ||కోరస్||
అయ్య ఓ రయ్య మా పూజలందుకోవయ్యా ||స్వామి రారా||
కాషాయం కట్టినోళ్లు కఠిన దీక్షలున్నారు
కాషాయం కట్టినోళ్లు కఠిన దీక్షలున్నారు ||కోరస్||
నీలి వస్త్రమేసినోళ్లు నియమముతో ఉన్నారు
నీలి వస్త్రమేసినోళ్లు నియమముతో ఉన్నారు ||కోరస్||
నల్లా బట్టలేసినోళ్లు నిన్నే నమ్ముకున్నారు
నల్లా బట్టలేసినోళ్లు నిన్నే నమ్ముకున్నారు ||కోరస్||
నల్లా బట్టలేసినోళ్లు నిన్నే నమ్ముకున్నారు
నల్లా బట్టలేసినోళ్లు నిన్నే నమ్ముకున్నారు ||కోరస్||
పందాళ రాజయ్య అండగ నువ్వు రావయ్య ||స్వామి రారా||
అదిగదిగో అదిగదిగో వస్తున్నాడు స్వామి వస్తున్నాడు
అదిగదిగో అదిగదిగో వస్తున్నాడు స్వామి వస్తున్నాడు ||కోరస్||
ఆ శబరిమలై కొండ దిగే వస్తున్నాడు
ఆ శబరిమలై కొండ దిగే వస్తున్నాడు ||కోరస్||
అదిగదిగో అదిగదిగో వస్తున్నాడు స్వామి వస్తున్నాడు
అదిగదిగో అదిగదిగో వస్తున్నాడు స్వామి వస్తున్నాడు ||కోరస్||
ఆ బంగారు మెట్లు దిగే వస్తున్నాడు
ఆ బంగారు మెట్లు దిగే వస్తున్నాడు ||కోరస్|| ||స్వామి రారా||