స్వామికిదే పూజ పాదపూజా అయ్యప్ప స్వామికి అందాల పూల పూజ
స్వామికిదే పూజ పాదపూజా అయ్యప్ప స్వామికి అందాల పూల పూజ
నా చిన్ని మణికంఠకు తీరొక్క పూల పూజ
నా చిన్ని మణికంఠకు తీరొక్క పూల పూజ
మంచి మనసుతో చేసే మల్లెల పూజా ||స్వామికిదే పూజ||
గుండెలున్న తండ్రికి గులాబీల పూజ - చల్లని మా స్వామికి చంపక పూల పూజ
చెయ్యి వదలరాదని చామంతుల పూజ - చెయ్యవదల రాదని చామంతుల పూజ
సర్వాంతర్యామికి సంపంగి పూల పూజ ||స్వామికిదే పూజ||
కారణ జన్ముడు స్వామికి కనకాంబర పూజ - మోక్షా ప్రదాతకు మొగలి పూల పూజ
దయ తలచే ధర్మ శాస్తకు ధవన పూల పూజ - దయ తలచే ధర్మ శాస్త్రకు ధనన పూల పూజ
కరుణాల బాలకు కమల పూల పూజ ||స్వామికిదే పూజ||
మమతల మా తండ్రికి మందార పూల పూజ - పందళ యువ రాజుకు పొన్న పూల పూజ
నారాయణ సుతునికి నాగమల్లెల పూజ - నారాయణ సుతునికి నాగ మల్లెల పూజ
కలి దోష హరునికి కలువ పూలు పూజ ||స్వామికిదే పూజ||
సద్గుణాల స్వామికి సన్న జాజుల పూజ - తియ్యని పలుకుల తండ్రికి తులసి దళ పూజ
మందస్మిత వదనునికి మాల తీల పూజ - మందస్మిత వదనునికి మాలతీల పూజ
భక్త కల్ప వల్లభునికి బంతి పూల పూజ ||స్వామికిదే పూజ||
పసిడి పావన మూర్తికి పారిజాత పూజ - కస్తూరి ధారునికి కదంబ పూల పూజ
గల గల నవ్వే స్వామికి గన్నేరు పూల పూజ - గల గల నవ్వే స్వామికి గన్నేరు పూల పూజ
జగదేక వీరునికి జాతి పూల పూజ ||స్వామికిదే పూజ||