తండ్రి గొప్పతనము తెలుసుకో.. ఓ... ఓ... కన్నా కొడుక
బ్రతుకు నావ చుక్కాని తెలుసుకో...
జన్మకు మూలము తెలుసుకో.... ఓ... ఓ... కన్నా కొడుక
నీవు బయట పడ్డ రోజు తలుచుకో....
ఊపిరి ఊదె నాన్న నెలలు మోసెను అమ్మ - ఊడిగము చేసి ఉపవాసమున్నాడురా నాన్న
ఊడిగము చేసి ఉపవాసమున్నాడురా నాన్న ||కోరస్||
కడుపులో పడగానే కంటి రెప్పలా చూసే - నిదురలో కదలినా తన నిద్దురనే బలిచేసే
నిదురలో కదలినా తన నిద్దురనే బలిచేసే ||కోరస్||
ఒట్టిగా ఊడి పడలేదు ఓ కన్నా కొడుకా పురిటీ బాధ నీవు పడలేదు. || తండ్రి గొప్పతనం ||
మొండి పనులతో నీవు మూర్ఖునిగా మారకురా - నిండైన ఆశలతో నిన్ను కన్నాడురా నాన్న
నిండైన ఆశలతో నిన్ను కన్నాడురా నాన్న ||కోరస్||
కాయ కష్టాలు చేసి నిన్ను పెద్ద చేసెనురా - నాన్నను బాధించి ఆకలితో మాడ్చి చంపకురా
నాన్నను బాధించి ఆకలితో మాడ్చి చంపకురా ||కోరస్||
బొడ్డు పేగు తెగిపడ్డవురా... ఓ కన్నా కొడుక నీ నెత్తురు నాన్నది కదరా || తండ్రి గొప్పతనం ||
పెళ్లాము మొన్నటిది పిల్లలు నిన్నటి వాళ్లు - సంసార సాగరం దాటించే నావ నాన్నేరా
సంసార సాగరం దాటించే నావ నాన్నేరా ||కోరస్||
దేవుడెక్కడ లేడు కన్న తండ్రిలో ఉన్నాడు - తండ్రి కాళ్ళకు మొక్క పైన దేవుడే దిక్కు
తండ్రి కాళ్ళకు మొక్క పైన దేవుడే దిక్కు ||కోరస్||
నాన్న లోటు ఎవరూ తీర్చరు..... ఓ కన్నా కొడుకు నాన్న దీవెన నిన్ను నడుపును || తండ్రి గొప్పతనం ||