అయ్యప్ప భక్తులకి, సేవా దృక్పధం కలిగిన హిందూ బంధువులకి
పుణ్యం పుంకావనం వారి ఆహ్వానము. ఈ సంస్థ శబరిమల ట్రావంకోర్ దేవస్థానం బోర్డు మరియు కేరళ పోలీస్ వారి అఫిషియల్ ప్రాజెక్ట్.
ఇందులో మనంకూడా వాలంటీర్స్ గా చేరి సేవ చేద్దాం మనం ముఖ్యముగా చెయ్యవలసిన సేవలు
మన గ్రామం, జిల్లా, రాష్ట్రము లోని ప్రముఖ దేవాలయాలు ఎప్పటికి అప్పడు శ్రుభ్రపరుచు కోవడం పండుగ దినములలో వాలంటీర్స్ గా q లైన్ లలో అన్నదానాలలో సేవ చెయ్యడం. ప్లాస్టిక్ మరియు వ్యర్ధ పదార్ధాలు లేకుండా శుభ్రపరచడం.
ఇరుముడి కట్టుకునే అప్పుడు ప్లాస్టిక్ లేకుండా గురుస్వాముల్ని ప్రోత్సహించడం, మనకి తెలిసిన అయ్యప్ప చరిత్రని స్వామివారి మహిమలని చాటి చెప్పడం.
శబరిమల సన్నిదానం పరిసర ప్రాంతాలు, పంబా, నిలక్కల్ లో ఉండి కొన్ని సేవా కార్యక్రమాలు చెయ్యాలి అనుకున్న వారికీ ఇది గొప్ప అవకాశం. మనం ఎవ్వరికి ఒక్క రూపాయి కట్టవలసిన అవసరం లేదు, ఎలాంటి సభ్యత్య రుసుము ఉండదు కేవలం సేవ చెయ్యాలి అని సంకల్పం ఉంటె చాలు. రండి మన తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని అన్ని జిల్లాలో ని భక్తులు అందరం కలసి ప్లాస్టిక్ రహిత పరిశుభ్రమైన హిందూ దేవాలయాలు భావితరాలకు అందిద్దాం.
*గురుస్వాములకి విన్నపము * పుణ్యం పుంకావనం ప్రాజెక్టు లో వాలంటీర్స్ గా చేరి నిజమైన సేవ చెయ్యాలి అనుకున్నవారిని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ని భక్తులని చేర్చండి
చేయి చేయి కలుపుదాం సాటి వారికీ సేవ చేద్దాం అయ్యప్ప స్వామి వారి సంపూర్ణ కృపను పొందుదాం. మరిన్ని వివరాలకు