Ayyappa Telugu

Loading

శ్రీ ధర్మశాస్త్రా అయ్యప్పస్వామి వారి పద్దెనిమిది మెట్లు దాని విశిష్ఠత

ayyappa calendar

మన హిందూ ధర్మసంప్రదాయ  ప్రకారము ప్రతీ దేవాలయములలో ముఖ్యమైనది మూలవిరాట్ మాత్రమే, కాని కేరళ రాష్ట్రంలో పరశురామునిచే ప్రతిష్టించబడిన శబరిమలైలో శ్రీ అయ్యప్పస్వామి దేవాలయములో అతిముఖ్యమైనది, అతి పవిత్రమైనది మన స్వామివారి ఆలయమునకు ముందున్న పదునెనిమిది మెట్లు. అంత పవిత్రమైన, సత్యమైన సాలగ్రామశిలతో నిర్మితమైన ఆ పద్దెనిమిది మెట్లను ఎక్కాలంటే స్వామివారి దీక్షమాల ధరియించి, మండల కాలము అనగా 41 దినముల పైన నియమనిష్టలతో వ్రతనియమములు ఆచరించి, పవితమైన ఇరుముడిని గురుస్వామి ద్వారా శిరస్సున ధరించిగాని ఎక్కుటకు వీలులేదు.

మన హిందు ధర్మసంప్రదాయము ప్రకారము ప్రతీ దేవాలయములలో ముందర ఉన్న ధ్వజస్తంభమును తాకి నమస్కరించిన పిదప దేవతలను దర్శించుకుంటాము కాని శబరిమలై శ్రీ అయ్యప్పస్వామి దేవాలయములో మాత్రము ముందర ఉన్న స్వామివారి 18 మెట్లకు తాకి నమస్కరించిన పిమ్మట ధ్వజస్తంభముని తాకి స్వామివారిని దర్శించుకుంటాము, అంటే మన శబరిగిరి వాసుడు అయ్యప్ప ఆ పద్దెనిమిది మెట్లకు ఎంత ప్రాముఖ్యత కల్పించాడో ఆ పద్దెనిమిది సంఖ్యకు ఎంత విలివనిచ్చారో, దీనిని బట్టి అర్ధమౌతుంది.

ఇక సంఖ్యా శాస్త్రము ప్రకారము "18" సంఖ్య చాలా ప్రాముఖ్యమైనది, వ్యాస భగవానుడు ఈ సంఖ్య యొక్క ప్రాధాన్యతను గూర్చి చాలా చక్కగా చెప్పిరి. 1+8=9 అనునది పరిపూర్ణమైన సంఖ్య, అంతే కాక ఆ సంఖ్య నవగ్రహములకు సూచిస్తుంది, కావున భక్తులు అశేషముగా ఆ స్వామి వారిని దర్శించుటకు నియమాల మాల మెడలో ధరించి నిష్టతో దీక్షబూని గురుస్వామి వారికి పూజలు జరిపి, ఇరుముడిని శిరస్సున ధరించి ఆ పద్దెనిమిది మెట్లను అధిరోహించి స్వామి వారిని దర్శించి తరిస్తూ యున్నారు. అందుకే మనము మన స్వామి పూజలలో కూడ పడిపూజ అంటామే కాని, అయ్యప్ప పూజ, స్వామివారి పూజ అని ఎక్కడా అనకుండా అయ్యప్పస్వామి వారి పడిపూజ అంటున్నాము. మరి ఆ 18 సంఖ్య గూర్చి కొన్ని వివరాలు తెలుసుకుందాం.

 

 

 

అమ్మవారి శక్తిపీఠములు - 18 
1. శాంకరీ దేవి, 2. కామాక్షీ దేవి, 3. శృంఖలాదేవి, 4. చాముండేశ్వరీ, 5. జోగులాంబ, 6. భ్రమరాంబ, 7. మహాలక్ష్మీ, 8. ఏకవీరిక, 9. గిరిజాదేవి, 10. మాణిక్యాంబ, 11. కామరూపిణి, 12. మాధవేశ్వరి, 13. మహాకాళి, 14. పురుహుతిక, 15. వైష్ణవీదేవి, 16. మాంగళ్యగౌరీ, 17. విశాలాక్షీ, 18. సరస్వతి.

 

వ్యాసమహాముని వ్రాసిన పురాణాలు - 18

1. మత్స్యపురాణము, 2. మార్కండేయ పురాణము, 3. దేవీభాగవత పురాణము, 4. భవిష్యత్పురాణము, 5.బ్రహ్మాండపురాణము, 6. బ్రహ్మవైవక్త పురాణము, 7. వరాహపురాణము, 8. వామనపురాణము, 9. విష్ణు పురాణము, 10. వాయు పురాణము, 11. అగ్నిపురాణము, 12. నారదపురాణము, 13. పద్మపురాణము, 14. లింగపురాణము, 15. గరుడపురాణము, 16. కూర్మపురాణము, 17. స్కాంద పురాణము, 18. బ్రహ్మపురాణము.

 

మహాభారతములోని పర్వములు - 18

1. ఆదిపర్వము, 2. సభాపర్వము, 3. అరణ్యపర్వము, 4. విరాటపర్వము, 5. ఉద్వేగపర్వము (వీటిని ఆది పంచాకాలని), 6. భీష్మపర్వము, 7. ద్రోణపర్వము, 8. కర్ణపర్వము, 9. శల్యపర్వము, 10. సౌప్తిక పర్వము, 11. శ్రీ పర్వము (వీటిని యుద్ధషష్ఠకములని, 12. శాంతి పర్వము, 13. అనుశాసన పర్వము, 14. ఆశ్రమవాస పర్వము, 15. అశ్వమేధపర్వము, 16. మౌసులపర్వము, 17. మహాప్రస్థాన పర్వము, 18. స్వర్గారోహణము (వీటిని శాంతి సప్తకములని).

 

భగవద్గీతలోని అధ్యాయములు - 18

1. అర్జున విషాదయోగము, 2. సంఖ్యాయోగము, 3. కర్మయోగము, 4. జ్ఞాన కర్మసన్యాస యోగము, 5. కర్మసన్యాస యోగము, 6. ఆత్మ సంయమయోగము, 7. జ్ఞానవిజ్ఞాన యోగము, 8. అక్షర పరబ్రహ్మయోగము, 9. రాజవిద్యరాజ గుహ్యయోగము, 10. విభూతి యోగము, 11. విశ్వరూప సందర్శన యోగము, 12. భక్తి యోగము, 13. క్షేత్రక్షేత్రజ్ఞ విభాగ యోగము, 14. గుణత్రయ విభాగ యోగము, 15. పురుషోత్తమ ప్రాప్తియోగము, 16. దైవాసుర సంపద్విభాగ యోగము, 17. శ్రద్దాత్రయ యోగము, 18. మోక్ష సన్యాస యోగము.

 

ఉప పురాణముల సంఖ్య - 18

1. సనత్కుమారము, 2. నృసింహ పురాణము, 3. స్కందపురాణము, 4. శివధర్మ పురాణము, 5. నందికేశ్వరపురాణము, 6. దుర్వాసపురాణము, 7. నారదీయ పురాణము, 8. కపిల పురాణము, 9. మానవ ఔజానన పురాణము, 10. మహేశ్వర పురాణము, 11. వారుణ పురాణము, 12. కాళీ పురాణము, 13. సాంబ పురాణము, 14. సౌర పురాణము, 15. పరశర పురాణము, 16. మారీచ పురాణము, 17. భార్గవ పురాణము, 18. బ్రహ్మాండ పురాణము.

 

 

స్మృతులు - 18

1.మనుస్మృతి, 2. బ్రహ్మస్మృతి, 3. దక్షస్మృతి, 4. గౌతమస్మృతి, 5. యమస్మృతి, 6. అంగీరసస్మృతి, 7. యోగీశ్వరస్మృతి, 8. ప్రచేసస్మృతి, 9. శాతతాప స్మృతి, 10. పరాశరస్మృతి, 11. సంవర్తనస్మృతి, 12. ఉశనస్మృతి, 13. శంఖస్మృతి, 14. లిఖితస్మృతి, 15. ఆత్రేయస్మృతి, 16. విష్ణుస్మృతి, 17. అపస్తంబస్మృతి, 18. హరీతస్మృతి.

 

సిద్ధులు - 18

1.అణిమ, 2. లహిమ, 3. మహిమ, 4. ఈశాక్త్వా, 5. వసిత్వ, 6. ప్రాకామ్యా, 7. బుద్ధి, 8. ఇచ్చా, 9. ప్రాప్తి, 10. సర్వకామ, 11. సర్వాసంపత్ప్రద, 12. సర్వప్రియంకర, 13. సర్వమంగళాకారణ, 14. సర్వదుఃఖవిమోచన, 15, సర్వమృత్యుప్రవాచ, 16. సర్వవిఘ్ననివారణ, 17. సర్వాంగసుందర, 18. సర్వాసౌభాగ్యదాయక. 

 

విద్యలు - 18
1. ఋగ్వేదము, 2. యజుర్వేదము, 3. సామవేదము, 4. అధర్వణవేదము, 5. శిక్షా, 6. వ్యాకరణము, 7. చందస్సు, 8. నిరుక్త, 9. జ్యోతిష్యము, 10. కల్పము, 11. మీమాంస, 12. న్యాయశాస్త్రము, 13. పురాణాలు, 14. ధర్మశాస్త్రాలు, 15.ఆయుర్వేదము, 16. ధనుర్వేదము, 17. నీతిశాస్త్రము, 18. అర్ధశాస్త్రము.


మానవ శరీరములో ఉన్న ముఖ్యమైన స్థానము - 18 
1. మూలాధారం, 2. స్వాధిష్ఠానము, 3. మణిపూర్వకము, 4. అనాహతము, 5. లంబిక, 6. విశుద్ధి, 7. అంగత, 8. బిందు, 9. అర్ధచక్రము, 10. రోధిని, 11. నాధం, 12. సాంధారము, 13. శక్తి, 14. వ్యాపిక, 15. సమన, 16. ఉన్మన, 17. మహాబిందు, 18. సహస్రావరము.

 

శబరిమలై ప్రాంతములో స్వామివారి పవిత్రగిరులు(కొండలు) - 18

1.శబరిమలై, 2.కాంతమలై(పొన్నంబలమేడు, 3. నాగమలై, 4. సుందరమలై(సౌందర్యమలై), 5. చిత్రంబలమేడు, 6. కల్కిమలై, 7. మదంగమలై(మాతాంగమలై), 8. శ్రీపాదమలై, 9. గ్రౌండర్మలై(అప్పాచిమేడు), 10. దేవమలై, 11. నైలడంకుండ్రు, 12. తహైప్పార్ మలై, 13. నిలక్కల్ మలై, 14. పుడుచ్చేరిమలై, 15. కాళైకట్టి, 16. ఇంజిప్పారై, 17. కరిమలై, 18. నీలిమలై.

 

అష్టరాగ,పంచేంద్రియ,తిగుణ,జ్ఞానాజ్ఞనములు - 18

1. కామము, 2. క్రోధము, 3. లోభము, 4. మోహము, 5. మాత్సర్యము, 6. దర్పము, 7. అహంకారము, 8. కన్ను, 9. ముక్కు, 10. చెవి, 11. నోరు (నాలుక), 12. చర్మము, 13. సత్వగుణము, 14. తమోగుణము, 15. రజోగుణము, 16. అవిద్య, 17. విద్య.

 

పద్దెనిమిది సార్లు మాల ధరించి వెళ్లి వచ్చిన స్వామి వార్ల పేర్లు - 18
1. కన్నెస్వామి, 2. కత్తిస్వామి, 3. గంటస్వామి, 4. గధాస్వామి, 5. పెరియస్వామి, 6. జ్యోతిస్వామి (గురుస్వామి), 7. సూర్యస్వామి, 8. చంద్రస్వామి, 9. త్రిశూలస్వామి, 10. విష్ణుచక్రస్వామి, 11. శంఖదార స్వామి, 12. నాగభరణస్వామి, 13. శ్రీహరి స్వామి, 14. పద్మస్వామి, 15. శ్రీస్వామి, 16. శ్రీశబరిగీశ్వరస్వామి (రాతిస్వామి), 17. ఓంకారస్వామి, 18. నారికేళస్వామి.


పద్దెనిమిదిసార్లు శబరిమలై వెళ్ళిన స్వాములు ప్రతీ ఏట శరంగుత్తిలో వదిలిపెట్టే వస్తువులు - 18
1. శరము (బాణం), 2. కత్తి, 3. గంట, 4. గధ, 5. విల్లు (ధనస్సు), 6. జ్యోతి (దీపము), 7. సూర్యుడు, 8. చంద్రుడు, 9. త్రిశూలము, 10. విష్ణు చక్రము, 11. శంఖం, 12. నాగాభరణం, 13. వేలాయుధం, 14. పద్మము (కమలము), 15. శ్రీ, 16. రాయి, 17. ఓం, 18. కొబ్బరిచెట్టు.


కాళికాదేవి యొక్క కరములు - 18
అమ్మవారి యొక్క కాళికారూపములో ఆమె చేతులు మొత్తము పద్దెనిమిది.


భారతయుద్ధము జరిగిన దినములు - 18
కురుక్షేత్ర సంగ్రామములో పాండవులు, కౌరవులు కలిసి యుద్ధము చేసినది పద్దెనిమిది రోజులు.

 

కురుపితామహుడు అంపశయ్యమీదనున్న దిననములు - 18

పాండవులకు, కౌరవులకు తాతగారైన భీష్ముడు రణరంగములలో నేలకు ఒరగకుండా అర్జునుడు నిర్మించిన అంపశయ్యపైన ఉన్నది 18 దినములు.

భారత యుద్ధములో పాల్గొన్న అక్షౌహిణులు-18, సుప్రసిద్ధమైన భాషలు కూడా పద్దెనిమిది.
అందువలన ఇంతటి విశిష్టత కలిగిన ఈ పద్దెనిమిది సంఖ్యగల పదునెట్టాంబడిని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్పస్వామివారు శబరిమలై దేవాలయములోను, ప్రతీ అయ్యప్ప దేవాలయాలలోను మరియు స్వామివారి పడిపూజలలోను ఇంత విలువ కలిగియున్నది.

పద్దెనిమిది మెట్ల సోపానాధిపతయే శరణం అయ్యప్ప.  

 

 

 

అయ్యప్ప కార్యక్రమాలు

Powered By

చిరునామా

ఫోన్ నంబరు

+91 7799 121 321

ఈ- మెయిల్

అనుసరించండి


య్య
ప్ప

కా
ర్య
క్ర
మా
లు