స్వామివారి దీక్ష తీసుకొనుటకు వృచ్చిక, ధనుస్సు, మకర మాసములు (కార్తీక, మార్గశిర, పుష్య మాసములు) శ్రేష్టము. మండల పుజలకుగాను ప్రతీ సంవత్సరము నవంబరు నెల 15 లేదా 16 తేదీలలో సాయంత్రము మొదలు తెరవబడి, సన్నిదానము డిశంబరు 26 లేదా 27 తేదీలలో రాత్రి వరకు భక్తుల దర్శనార్ధం తెరవబదడివుండును. మండలకాలము నందు పగలు 12 గంటల వరకు నెయ్యాభిషేకం, సాయంత్రం పుష్పాభిషేకం, అలంకార దర్శనము మాత్రమే యుండును. ఈ మండలకాలములో పడిపూజలు ఉండవు.
డిశంబరు నెల 27న మూయబడిన సన్నిధానం తిరిగి మకర మహోత్సవమునకు గాను అదే నెల ౩౦వ తేదీ సాయంత్రం 5 గంటలకు తెరవబడి జనవరి 20వ తేదీ ఉదయం 7 గంటలకు మూయబడును. మకర మహోత్సవ కాలములో కుడా పగలు 12 గంటల వరకు మాత్రమే నేయ్యాభిషేకం చేయుదురు.
జనవరి 16, 17, 18 తేదీలలో స్వామివారి ఆలయమునకు ముందున్న (దివ్య పదునెట్టాoబడి) పవిత్రమైన మెట్లకు సాయంత్రము 6 గంటల నుండి పడిపూజలు నిర్వహించెదరు. జనవరి 18వ తేదీన స్వామివారికి కళశాభిషేకం చేస్తారు. కళశాభిషేకం చేసిన తరువాత నేయ్యాభిషేకం చేయరు. అలాగే మణికంఠ స్వామివారు పందళరాజు వారికి చెప్పినట్లు, మకర సంక్రాంతి దినమున సాయంకాలము సమయంలో, పొన్నంబలమేడు సమీపంలో మకరజ్యోతి నక్షత్ర దర్శనం కనిపించును. అదియే మకరజ్యోతి.
ఎరిమేలి నుండి పెద్దదారిలో పాదయాత్ర డిశంబరు 30 తేదీ నుండి జనవరి 14 వరకు మాత్రమే అనుమతించెదరు.
ప్రతీ ఏటా స్వామివారి సన్నిధానములో మండలపూజ, మకర మహోత్సవం, నెలసరి పూజలు (ప్రతీనెలల్లోనూ), ఉత్సాహంపూజ, కొడియట్టుపూజ, ఆరట్టుపూజ, ఉత్తరఫంగుణి పూజ, విష్ణు మహోత్సవము, ప్రతిష్టాపనరోజు, ఓనం పూజ, శ్రీ చిత్తా అత్తురిణి పూజలు ఇటువంటి పండుగలు, పూజలు జరుగును.