Ayyappa Telugu

Loading

అయ్యప్ప దీక్ష

ayyappa calendar

కేరళ రాష్ట్రంలో పంబానది తీర ప్రాంతంలో శబరిమలై అనే పర్వత సమూహము కలదు. ఆ కొండల ప్రాంతము చాలా భయంకరమైనది. పూర్వము ఆ ప్రాంతములోనే మహామునులు తపస్సు కొరకై అనేక ఆశ్రమాలు నిర్మించుకున్నారు. క్రూరమ్రుగములు నివశించే ఆ భయంకరమైన అడవి ప్రాంతములో పంబానదికి అతి సమీపములో ఐదుకొండల సమూహములో ఉన్న శబరి కొండపై హరిహరసుతుడు, అఖిలాండకోటి భాహ్మండ నాయకుడు, అనాధ రక్షకుడు, ఆపత్భాంధవుడు, ఆశ్రిత జన రక్షకుడు, కలియుగ వరదుడు, శ్రీ ధర్మశాస్త్రావారు,  మణికంఠుడిగా భూలోకంలో అవతరించి పండలరాజుకు ముద్దుల తనయుడై, పులిపాల కొరకు అడవికి వెళ్లి మహిషి అనే రక్షసిని సంహరించి, వావార్ అనే బందిపోటును తన భక్తునిగా మార్చి, శబరి తల్లికి మోక్షాన్ని ప్రసాదించి అతి కష్టతరమైన పట్టబందాసముతో చిన్ముద్రధారిగా అభయహస్తముతో అష్టాదశ సోపానములపై కూర్చున్న ఏకాంతవాసుడు శ్రీ అయ్యప్ప స్వామి వారికి శబరిమలైలో చూస్తూ ఉంటే భక్తి పారవశ్యంతో తనువు పులకరిస్తుంది. ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప అంటూ భక్తులు చేసే శరణుఘోషతో సన్నిధానము నలుమూలలు మారుమ్రోగుతూ ఉంటుంది.

శ్రీ అయ్యప్పస్వామి వారి దర్శనం శబరిమలైలో పొందాలంటే కనీసము మండల కాలము అనగా 41 దినములు గాని ఆపైన ఎన్ని దినములు గాని మంచి గురుస్వామిని (ఇంతకు ముందు 6 సార్లు శబరిమలై యాత్ర చేసి వెళ్లి వచ్చినవారు) ఎంచుకొని నియమ నిబందనల ప్రకారము కఠినమైన దీక్ష చేసి సజ్జన సాంగత్యముతో దేవాలయాలలోను, పవిత్రమైన స్థలములలోను, స్వామివారి పూజలలోను, భగవంతుని నామాన్ని జపం చేస్తూ దీక్షను సాగించాలి. అలా దీక్ష చేసి శబరిమలై యాత్రకు వెళ్లి సత్ ఫలితాన్నిచే అయ్యప్పస్వామి వారి కృపా కటాక్షమును పొందుతారు. అందువల్ల అయ్యప్పదీక్ష శబరిమలై యాత్రలో ఎంతో పవితమైనది, కాబట్టి యాత్ర చేసే ప్రతి అయ్యప్పలు నియమ నిబంధనలు నిష్టతో పాటించి యాత్ర చేయవలసినదిగా కోరుతున్నాను.
మనము చేసే పూజలు, భజనలు, భక్తితో సాగాలి కాని ఆడంబరాలకు పోయి, ఆర్భాటాలకు పోయి చేయరాదు. పూజలు, భజనలు, వీలైనంత వరకు ఎంత తొందరగా ముగిస్తే అంత మంచిది. 

అయ్యప్ప దీక్షతో మనము మన సన్నిధానములో ముందుగా గణపతి, సుబ్రమణ్య, మంజుమాత అమ్మవారితో పాటు ఇతర దేవతలను స్తుతించి తదుపరి స్వామివారిని పూజించి కీర్తనలు పాడుకుంటూ హారతి ఇవ్వడము మన సంప్రదాయము, మాల ధరించిన అయ్యప్ప స్వాములంతా సమానమే, గొప్పబీద అనే తారతమ్యం లేకుండా అహం బ్రహ్మస్మి తత్వమసి సిద్దాంతమునకు కట్టుబడి ఉండుట చాలా మంచిది.

      ఓం శ్రీ స్వామియే శరణం.

 
 
 

అయ్యప్ప కార్యక్రమాలు

Powered By

చిరునామా

ఫోన్ నంబరు

+91 7799 121 321

ఈ- మెయిల్

అనుసరించండి


య్య
ప్ప

కా
ర్య
క్ర
మా
లు